నవ మహిళా సాధికార కేంద్రంలో యోగ్యత పత్రాల ప్రదానం
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : నవ లిమిటెడ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన నవ మహిళా సాధికార కేంద్రంలో డీటీపీ & టాలీ కోర్సుల శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు యోగ్యత పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముసుము రిసోర్సెస్ లిమిటెడ్ (జాంబియా) ప్రతినిధులు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డా. సిక్స్టస్ ములెంగా, సంస్థ అడ్వైజర్ మ్ర. అర్బనో ములెంగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా టాలీ కోర్సులో శిక్షణ పొందిన భార్గవి మాట్లాడుతూ మహిళా సాధికార కేంద్రం తమలాంటి ఎందరికో ఉచిత శిక్షణ అందిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని తెలిపారు. అనంతరం అతిథులు శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు యోగ్యత పత్రాలను అందజేశారు.
నవ లిమిటెడ్ జనరల్ మేనేజర్ (CSR) ఎం. జి. ఎం. ప్రసాద్ మాట్లాడుతూ ఇప్పటివరకు సంస్థ చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. మహిళా సాధికార కేంద్రం శిక్షణతో పాటు అక్కడ తయారైన వస్తువులను వివిధ దేశాలకు ఎగుమతి చేస్తూ ఉపాధిని కల్పిస్తోందని తెలిపారు.
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డా. సిక్స్టస్ ములెంగా మాట్లాడుతూ, నవ లిమిటెడ్ చేపట్టిన CSR కార్యక్రమాలను అభినందించారు.డైరెక్టర్ (బిజినెస్ డెవలప్మెంట్) సి. వి. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, శిక్షణ పొందిన అభ్యర్థులను అభినందించి, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రతినిధులు వృత్తి విద్య కేంద్రం, నవ భారత్ నేత్రవైద్య కేంద్రం, నవ భారత్ పాఠశాలను సందర్శించారు.
ఈ కార్యక్రమంలో సి.హెచ్. శ్రీనివాసరావు, టి. అరుణ, బి. అరుణ, కవిత, శిరీష, అముద, రమేష్, రాజేశ్వరావు, శ్రీకాంత్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment