గ్రూప్-1 ఫలితాల్లో మంచి మార్కులు సాదించిన ఇల్లందు ఎస్సై ను సత్కరించిన ఎస్పి

గ్రూప్-1 ఫలితాల్లో మంచి మార్కులు సాదించిన ఇల్లందు ఎస్సై ను సత్కరించిన ఎస్పి
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :   తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్-1 ఫలితాల్లో 502.5 మార్కులు సాధించిన ఇల్లందు ఎస్సై సందీప్‌ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఘనంగా సన్మానించారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సందీప్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

పోలీస్ విధుల్లో ఉంటూనే గ్రూప్-1 పరీక్షలకు హాజరై మెరుగైన ప్రతిభ కనబర్చడం ప్రశంసనీయమని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టి పోటీ ప్రపంచంలో పైకి ఎదగడానికి కృషి చేయడం యువతకు ఆదర్శమని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని సందీప్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఇల్లందు డీఎస్పీ చంద్రభాను, ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.