ఆకాశవాణి కొత్తగూడెం యువ వాణి కార్యక్రమంలో పాల్గొన్న పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు

ఆకాశవాణి కొత్తగూడెం యువ వాణి కార్యక్రమంలో పాల్గొన్న పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :   పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) హిందీ విభాగం విద్యార్థులు బుధవారం ఆకాశవాణి కొత్తగూడెం యువ వాణి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎస్.కె. రేష్మ (థర్డ్ బీకాం) "మహిళల హక్కులు, చట్టాలు" అనే అంశంపై ప్రసంగిస్తూ, మహిళల హక్కులను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా సమాజంలో లింగ సమానత్వాన్ని కాపాడవచ్చని, మహిళలు తమ హక్కులను తెలుసుకోవడం ద్వారా శక్తివంతమైన భవిష్యత్తును నిర్మించుకోవచ్చని తెలిపారు.

అనంతరం ఎస్. లావణ్య (థర్డ్ బీ.జెడ్.సీ) "హిందీ మహిళా సాహిత్యకారులు" అనే అంశంపై ప్రసంగిస్తూ, మహిళా రచయితలు సమాజంలోని మహిళల వివిధ సమస్యలను, జీవితాలను, భావోద్వేగాలను తమ రచనల ద్వారా తెలియజేసి, మహిళలను చైతన్యవంతులను చేశారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన హిందీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్లు టి. అరుణ కుమారి, షాహనాజ్ లను కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి. పద్మ, ఇతర అధ్యాపక బృందం అభినందించారు.

Blogger ఆధారితం.