అనాధ శరణాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి

అనాధ శరణాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  కొత్తగూడెం చమన్ బస్తిలోని శ్రీ జ్యోతి అనాధ వృద్ధాశ్రమాన్ని, రైటర్ బస్తిలో ఉన్న సత్య సాయి అనాధాశ్రమాన్ని సోమవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి సందర్శించారు.

ఈ సందర్భంగా న్యాయమూర్తి వృద్ధులకు, మానసిక వికలాంగులకు అందిస్తున్న కనీస సౌకర్యాల గురించి ఆశ్రమ నిర్వహకులను అడిగి తెలుసుకున్నారు. వివిధ కారణాల వల్ల సంరక్షణ కష్టంగా ఉండడంతో ఆశ్రయానికి వచ్చిన వృద్ధులకు ఆహారం తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

న్యాయమూర్తి అనాధ శరణాలయం ఆవరణ, కిచెన్ రూమ్, స్టోర్ రూమ్‌ను పరిశీలించి, అనాధ శరణాలయాన్ని సజావుగా నిర్వహించాలని సూచించారు. జ్యోతి అనాధ వృద్ధాశ్రమంలో రిజిస్టర్లు సరిగా లేకపోవడంతో న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ కౌన్సిల్ పి. నిరంజన్ రావు, న్యాయవాది మెండు రాజమల్లు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.