జిల్లా అభివృద్ధిలో టీఎన్జీవోలు కీలక భాగస్వాములు కావాలి: కలెక్టర్

జిల్లా అభివృద్ధిలో టీఎన్జీవోలు కీలక భాగస్వాములు కావాలి:  కలెక్టర్

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  జిల్లా అభివృద్ధి ప్రజల ఆకాంక్ష అయితే, సమగ్ర అభివృద్ధి అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. బుధవారం ఆయన టీఎన్జీవో సంఘం నూతన డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని మున్సిపాలిటీలు, గ్రామాలు సమగ్రంగా అభివృద్ధి చెందేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా అభివృద్ధిని కొనసాగించేందుకు సమీకృత విధానం అవసరమని, అభ్యున్నతికి అవసరమైన సలహాలు, సూచనలు అందించాల్సిన బాధ్యత టీఎన్జీవోలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రధానంగా రైతులకు సాంకేతికతపై అవగాహన కల్పించేందుకు విజ్ఞాన ప్రదర్శనలు నిర్వహించాలని, వ్యవసాయ యాంత్రీకరణను ప్రవేశపెట్టేందుకు, విస్తరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. టీఎన్జీవోలు వ్యవసాయ రంగం బలోపేతానికి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయాలని సూచించారు. కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు అమరనేని రామారావు, కార్యదర్శి సాయి భార్గవ్ చైతన్య, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.