భద్రాచలంలో శ్రీ సీతారామ కళ్యాణం, పట్టాభిషేకం ఏర్పాట్లపై జిల్లా స్థాయి సమీక్ష

భద్రాచలంలో శ్రీ సీతారామ కళ్యాణం, పట్టాభిషేకం ఏర్పాట్లపై జిల్లా స్థాయి సమీక్ష
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో ఏప్రిల్ 6, 7 తేదీల్లో నిర్వహించనున్న శ్రీ సీతారామ కళ్యాణం, పట్టాభిషేకం వేడుకల ఏర్పాట్లపై ఈ నెల 6న జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రకటించారు. బుధవారం ఒక ప్రకటన విడుదల చేసిన ఆయన, ఈ సమీక్ష ఉదయం 11 గంటలకు భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరుగుతుందని వెల్లడించారు.

శ్రీ సీతారామ కళ్యాణం, పట్టాభిషేకం వేడుకలకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా హాజరయ్యే అవకాశం ఉందని, వారందరికీ వసతి, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత తదితర అంశాల్లో పూర్తి ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత జిల్లా అధికారులు సమగ్ర సమాచారం అందించాల్సిందిగా సూచించారు.

Blogger ఆధారితం.