ఆళ్ళ నరసింహారావు పార్థివదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే కూనంనేని
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : గ్రంథాలయం రిటైర్డ్ ఉద్యోగి, సీపీఐ సానుభూతిపరుడు ఆళ్ళ నరసింహారావు (60) అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శనివారం పాల్వంచ పట్టణంలోని జ్యోతి నగర్‌లోని వారి నివాసానికి చేరుకుని పార్థివదేహానికి ఎర్రజెండా కప్పి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
కూనంనేనితో పాటు సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు ముత్యాల విశ్వనాథం, మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, పట్టణ సహాయ కార్యదర్శి ఉప్పుశెట్టి రాహుల్, జిల్లా సమితి సభ్యులు బండి నాగేశ్వరరావు, శనగారపు శ్రీనివాసరావు, నరహరి నాగేశ్వరరావు, ఇట్టి వెంకట్రావు, నిమ్మల రాంబాబు తదితరులు నివాళులర్పించారు.

Post a Comment