ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించండి – కలెక్టర్

ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించండి – కలెక్టర్

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : జిల్లా వ్యాప్తంగా భూముల క్రమబద్ధీకరణ కోసం దాఖలైన లాండ్స్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్) దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలనను మొబైల్ యాప్ ద్వారా వేగవంతం చేయాలని సూచించారు.

దరఖాస్తుల పరిశీలనలో నిర్దేశిత మార్గదర్శకాలను పాటిస్తూ, సమగ్ర పరిశీలన చేయాలని అధికారులకు సూచించారు. నీటిపారుదల శాఖ సిబ్బంది ప్రతిరోజూ లక్ష్యాలను నిర్దేశించుకుని స్క్రూటినీ పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే, నీటి వనరులు బఫర్ జోన్, ఎఫ్‌టిఏలలో ఉండకూడదని స్పష్టంచేశారు. లేఅవుట్ క్రమబద్ధీకరణలో నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ, అప్రోచ్ రోడ్లు, ప్లాట్ల మధ్య రహదారులను సక్రమంగా పరిశీలించాలని అన్నారు.

టౌన్ ప్లానింగ్ అధికారులు, పంచాయతీ సెక్రటరీలు ముందుగా పెండింగ్ దరఖాస్తుల లొకేషన్లను గుర్తించాలన్నారు. రెండు వారాల్లో పెండింగ్ దరఖాస్తుల పరిశీలనను పూర్తి చేయాలని, పనులను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌ను ఆదేశించారు. తక్కువ సంఖ్యలో ఉన్న దరఖాస్తులను రెండు రోజుల్లోనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆర్డివోలు మధు, దామోదర్ రావులను ఆదేశించారు.

Blogger ఆధారితం.