బొగ్గు గనిని సందర్శించిన జిల్లా న్యాయ సేవాదికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : జిల్లా న్యాయ సేవాదికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి జి. భానుమతి శనివారం కొత్తగూడెం సమీపంలోని పివికే-5 బొగ్గు గనిని సందర్శించారు. ఈ సందర్భంగా గనిలో జరుగుతున్న ఉత్పత్తి ప్రక్రియను సమీక్షించి, రక్షణ చర్యలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం బొగ్గు గని కార్మికులతో న్యాయ చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించి, వారికి హక్కులు, కార్మిక చట్టాలపై అవగాహన కల్పించారు. తమ వృత్తి పట్ల అంకితభావంతో పనిచేస్తున్న కార్మికులను న్యాయమూర్తి అభినందించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పి. నిరంజన్ రావు, సీనియర్ న్యాయవాది మెండు రాజమల్లు, ఏజెంట్ బి. రవీందర్, పివికే-5 మైన్ డాక్టర్ ఎం.వి.ఎన్. శ్యాంప్రసాద్ మైన్ మేనేజర్, అండర్ మేనేజర్ శ్రావణ్, అడిషనల్ మేనేజర్ ఎస్కే సలీం, మైన్ ఇంజనీర్ శ్రీనివాస్, వెల్ఫేర్ ఆఫీసర్ షకీల్, ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ హుమాయున్, ఐఎన్‌టీయూసీ నాయకులు సీతారాం,మైన్ ఇంజనీర్లు వి.కృష్ణవేణి, కె.అనుపమ, 2 టౌన్ ఎస్.ఐ.షాహిన్, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment