TGPEA డైరీని ఆవిష్కరించిన బిటిపిఎస్ చీఫ్ ఇంజనీర్ బిచ్చన్న

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : మణుగూరులోని బీటీపీఎస్ లో మంగళవారం చీఫ్ ఇంజనీర్ బి. బిచ్చన్న TGPEA (తెలంగాణ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్) నూతన డైరీ, క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్మాగారంలో అధిక విద్యుత్ ఉత్పత్తికి ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ సాంకేతిక సమస్యలను అధిగమించాలని సూచించారు. ఇంజనీర్ల సమస్యల పరిష్కారం కోసం TGPEA అంకితభావంతో పని చేస్తుందని కితాబు ఇచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్న సూపర్‌డింటెంట్ ఇంజనీర్లు డబ్ల్యూ. రమేష్ బాబు, టీ. శ్రీనివాసరావు మాట్లాడుతూ జెన్కోలో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమం కోసం TGPEA అసోసియేషన్ నిస్వార్థంగా పోరాటం చేస్తుందని చెప్పారు. ఈ అసోసియేషన్, ఉద్యోగ జేఏసీ కృషి వల్లే రామగుండం ధర్మల్ స్టేషన్‌ను జెనకో ఆధ్వర్యంలో నిర్మించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో TGPEA బీటీపీఎస్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్. శ్రీనివాస్ రెడ్డి, జెన్కో కార్యదర్శి బి. రవి ప్రసాద్, TSEAEA బ్రాంచ్ కార్యదర్శి రవితేజ, నాయకులు రాము, వెంకటేష్, మహేష్, నరేష్, సాయిరామ్, రషీద్, అఖిలేష్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment