AIM లీడ్ స్కూల్ విద్యార్థి షణ్ముక్తు సాయిని అభినందించిన పాల్వంచ డిఎస్పి

AIM లీడ్ స్కూల్ విద్యార్థి షణ్ముక్తు సాయిని అభినందించిన పాల్వంచ డిఎస్పి
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  AIM లీడ్ స్కూల్ విద్యార్థి షణ్ముక్తు సాయిని పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్ అభినందించారు. శనివారం ఖమ్మంలో జరిగిన నేషనల్ లెవెల్ కరాటే కాంపిటీషన్లో పాల్వంచ AIM లీడ్ స్కూలులో ఎనిమిదవ తరగతి చదువుతున్న షణ్ముక్తు సాయి ప్రథమ బహుమతి పొందిన సందర్భంగా పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్ అభినందించారు.

ఈ సందర్భంగా డిఎస్పి సతీష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో కూడా తమ ప్రతిభ కనపరచాలని ఆకాంక్షించారు. AIM లీడ్ స్కూల్లో విద్యార్థులకు చదువులతో పాటు ఆటల్లో కూడా వారిని ప్రోత్సహించడం గొప్ప విషయమని అభినందించారు.

ఈ కార్యక్రమంలో AIM LEAD స్కూల్ ప్రిన్సిపల్ రెంటాల నాగభూషణం, పాల్వంచ సీఐ కే. సతీష్, ఎస్ఐ రాఘవయ్య, పాఠశాల ఏవో మోహన్ రావు, పి.ఈ.టి రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.