శివాలయం విగ్రహ ప్రతిష్ట పూజల్లో పాల్గొన్న కొత్వాల

శివాలయం విగ్రహ ప్రతిష్ట పూజల్లో పాల్గొన్న కొత్వాల
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  పాల్వంచ మండల పరిధి జగన్నాధపురంలోని శ్రీ కనకదుర్గ దేవాలయం (పెద్దమ్మతల్లి గుడి) ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శివాలయంలో ఈ నెల 10న విగ్రహ ప్రతిష్ఠాపన జరుగుతున్న సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.శుక్రవారం ప్రతిష్ఠామూర్తులకు జలాధివాసం కార్యక్రమం చేపట్టిన సందర్భంగా రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ZPTC యర్రంశెట్టి ముత్తయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోండం వెంకన్న, కాంగ్రెస్ నాయకులు కందుకూరి రాము, దారా చిరంజీవి, పులి సత్యనారాయణ, శివ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.