క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా ఉండాలి - న్యాయమూర్తి జి. భానుమతి
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్యాన్సర్‌ను సకాలంలో గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. బలమైన సంకల్పంతో, సమర్థవంతమైన వైద్యంతో క్యాన్సర్ వ్యాధి నుండి బయటపడవచ్చని తెలిపారు. క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సూచించారు.ప్రపంచంలో అత్యధిక మరణాలు క్యాన్సర్ కారణంగా జరుగుతున్నాయని తెలిపారు. రోగం కంటే భయమే ప్రమాదమని వారు వివరించారు. ప్రాథమిక దశలో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్‌ను గుర్తించడం ద్వారా సరైన చికిత్సతో నయం చేయవచ్చని పేర్కొన్నారు. వివిధ రకాల క్యాన్సర్‌లైన రొమ్ము, గర్భాశయ, గొంతు క్యాన్సర్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. సరైన ఆహారం తీసుకుంటూ వైద్యుల సలహాలను పాటిస్తే క్యాన్సర్‌ను జయించవచ్చని పలువురు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం జనరల్ హాస్పిటల్ డాక్టర్ పృథ్వి, డాక్టర్ తేజశ్రీ, డాక్టర్ సాగరిక , న్యాయవాది మెండు రాజమల్లు, కళాశాల ప్రిన్సిపల్ అనురాధ, వైస్ ప్రిన్సిపల్ సంగీత, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment