జిల్లా పోలీస్ సిబ్బందిని అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : కరీంనగర్‌లో జనవరి 28 - ఫిబ్రవరి 1 వరకు జరిగిన 3వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్-2025లో జిల్లాకు చెందిన క్రీడాకారులు 5 బంగారు పతకాలు, 1 రజత, 8 కాంస్య పతకాలు సాధించారు. సోమవారం పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్‌ను జిల్లా ఎస్పీ కార్యాలయంలో కలిశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా, జోనల్ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించినందుకు క్రీడాకారులను అభినందించారు. ఇదే స్పూర్తిని కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం పతకాలు గెలుచుకున్న క్రీడాకారులకు ప్రోత్సాహక నగదును జిల్లా ఎస్పీ అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు, వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు, హోంగార్డ్స్ ఇంచార్జ్ ఆర్ఐ నరసింహారావు, ఎంటిఓ సుధాకర్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment