సామూహిక అక్షరాభ్యాసం చక్కని కార్యక్రమం - న్యాయమూర్తి
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : సామూహిక అక్షరాభ్యాసం ఓ చక్కని కార్యక్రమం అని, విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని న్యాయమూర్తి జి. భానుమతి అన్నారు. సోమవారం కొత్తగూడెం లోని 34వ వార్డు లో శ్రీ సరస్వతీ శిశు మందిర్ స్కూల్ లో వసంత పంచమి సందర్భంగా నిర్వహించిన చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భద్రాద్రికొత్తగూడెం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ జి. భానుమతి, డాక్టర్ భవిత హాజరయ్యారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ చిన్నారులు చక్కగా చదివి ఉన్నత స్థాయికి రావాలని ఆకాంక్షించారు. విద్య అనేది నేటి రోజుల్లో చాలా కీలకమైనదని, చదువుతోనే ఉన్నత స్థానానికి అధిరోహించగలమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాది మెండు రాజమల్లు, శ్రీ సరస్వతీ శిశు మందిర్ స్కూల్ ప్రెసిడెంట్ పిల్లి రాజేశ్వరరావు, సెక్రటరీ నాగభూషణ్, పాఠశాల హెచ్. ఎం. స్రవంతి, రజిత పారా లీగల్ వాలంటీర్స్ అమడగాని రాజకుమారి, భాగ్య, ఎస్కే భాను, పాఠశాల టీచర్స్, పేరెంట్స్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment