శక్తి సదన్ కేంద్రాన్ని సందర్శించిన న్యాయమూర్తి జి.భానుమతి

శక్తి సదన్ కేంద్రాన్ని సందర్శించిన న్యాయమూర్తి జి.భానుమతి
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : కొత్తగూడెం, విద్యానగర్‌లోని శక్తి సదన్ కేంద్రాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి గురువారం సందర్శించారు.

ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ఆపదలో ఉన్న మహిళలకు ఆశ్రయం, ఆహారం, దుస్తులు, వైద్యం, సంరక్షణ వంటి ప్రాథమిక అవసరాల కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మహిళలు, బాలికలకు న్యాయ సహాయం మరియు మార్గదర్శకత్వం అందించి వారికి పూర్తి భరోసా కల్పించాలని న్యాయమూర్తి సూచించారు.నిరాధారణకు గురైన బాలికల సమస్యలను తెలుసుకొని వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం జరిగింది. అనంతరం వన్ స్టాప్ సఖి సెంటర్, చమన్ బస్తీ, కొత్తగూడెంలో ఉన్న జ్యోతి అనాధాశ్రమాన్ని సందర్శించి, అక్కడ వృద్ధులకు అందుతున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. కొంత నిత్యవసర సామగ్రిని అందించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి. నిరంజన్ రావు, న్యాయవాది మెండు రాజమల్లు, శక్తి సదన్ నిర్వాహకులు, పారాలీగల్ వాలంటీర్ బి. రాజమణి తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.