పెద్దమ్మ తల్లి గుడి పూజల్లో పాల్గొన్న రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్ కొత్వాల

పెద్దమ్మ తల్లి గుడి పూజల్లో పాల్గొన్న రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్ కొత్వాల
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : పాల్వంచ మండలం పరిధిలోని కేశవాపురం - జగన్నాథపురం గ్రామంలోని శ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మ గుడి)లో గురువారం జరిగిన పూజా కార్యక్రమాల్లో రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.

ఈనెల 10న పెద్దమ్మ గుడి ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శివాలయంలో విగ్రహ ప్రతిష్ఠ, దాత నూతక్కి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్మించిన కళ్యాణ మండపం, అన్నదాన సత్రాల ప్రారంభోత్సవానికి సంబంధించిన పూజా కార్యక్రమాల్లో కొత్వాల పాల్గొని పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమాల్లో పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొండం వెంకన్న, ఆర్‌టీఏ సభ్యులు బాధర్ల జోషి, బానోత్ బాలాజీ, మాలోత్ నందానాయక్, కొండం పుల్లయ్య, దేవా, ఆరుద్ర వెంకన్న, బాధర్ల నాగేశ్వరరావు, మహిపతి శ్రీను, కుమార్, నూతక్కి శ్రీనివాసరావు, గంధం వెంగళరావు, జనార్దన్ రెడ్డి, గంధం పెద్ద రామయ్య, గంధం సోమయ్య, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.