పాత పాల్వంచ శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

పాత పాల్వంచ శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

 జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  పాత పాల్వంచలో శ్రీ అలివేలుమంగా పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభంపాత పాల్వంచలోని శ్రీ అలివేలుమంగా పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 10వ తేదీ నుండి 13వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.రెండో రోజు మంగళవారం, దేవాలయ ప్రధాన పూజారి కందాల సింహాద్రి ఆనందకుమారాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాల ప్రవేశం, మండపారాధన, గరుడ వాహనం, ధ్వజారోహణం, గరుడ ముద్దా, అగ్ని ప్రతిష్ట, భోగానివేదన, మహిళలు పసుపు కొట్టడం వంటి పూజలు నిర్వహించారు.

ఈ పూజా కార్యక్రమాల్లో రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, సతీమణి విమలాదేవి దంపతులు పాల్గొని పూజలు చేశారు.

కార్యక్రమంలో పాత పాల్వంచ మాజీ కౌన్సిలర్ కొత్వాల సత్యనారాయణ, నిర్వాహకులు కిలారి సుజాత, కోండం వెంకన్న, గంగుల చంద్రశేఖర్, ముళ్ళపూడి శ్రీకాంత్, విజయలక్ష్మి, సీతక్క, రాఘవమ్మ, లక్ష్మి, భవాని, జ్యోతి, సత్యవతి, మంగవేణి, జాహ్నవి, కృష్ణవేణి, కమల, రత్నమ్మ, సునీల్, జయ, వనమా రత్నం, మౌనిక, రామ, చంద్రకళ, రమాదేవి, కీర్తి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.