రేపు పెద్దమ్మ తల్లి గుడిలో చండీహోమం
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : పాల్వంచ మండలం జగన్నాథపురం - కేశవాపురంలోని శ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మగుడి) నందు పౌర్ణమి రోజున నిర్వహించే చండీహోమం బుధవారం జరుపబడుతుందని ఆలయ సిబ్బంది మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ చండీహోమంలో పాల్గొననున్న భక్తులు ముందుగా లేదా అదే రోజున ₹2516.00 చెల్లించి టికెట్ పొందడంతో పాటు, తమ గోత్రనామాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. చండీహోమంలో పాల్గొన్న దంపతులకు శేష వస్త్ర ప్రసాదాలతో పాటు ఉచిత అన్నప్రసాదం ఏర్పాటు చేయబడుతుందని పేర్కొన్నారు.
ప్రత్యక్షంగా పాల్గొనలేని భక్తుల పేరుతో సంకల్పం చేసి హోమం నిర్వహించబడుతుందని తెలిపారు. హోమంలో పాల్గొనే భక్తులు సాంప్రదాయ దుస్తులు, అనగా మగవారు ధోతి, కండువా ధరించాలి, ఆడవారు చీర ధరించాలి.వివరాలకు ఫోన్ నెం. 6303408458 ను సంప్రదించవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు.

Post a Comment