జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి - న్యాయమూర్తి జి. భానుమతి

జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి - న్యాయమూర్తి జి. భానుమతి

 జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  కొత్తగూడెం జిల్లా కోర్టులో మార్చి 8న జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి జి. భానుమతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరి మీదైనా ఏమైనా కేసులు ఉన్నట్లైతే వాటిని జాతీయ లోక్ అదాలత్‌ లో రాజీ చేసుకోవచ్చని తెలిపారు.

రాజీ పడదగ్గ కేసులు ఇవే:

యాక్సిడెంట్ కేసులు, సివిల్ కేసులు, చీటింగ్ కేసులు, చిట్ ఫండ్ కేసులు, భూ తగాదాలకు సంబంధించిన కేసులు, వివాహ బంధానికి సంబంధించిన కేసులు, చిన్నచిన్న దొంగతనం కేసులు, ట్రాఫిక్ చలాన్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, కుటుంబ తగాదాలు, బ్యాంకు లావాదేవీల కేసులు, టెలిఫోన్ బకాయిల కేసులు, కొట్టుకున్న కేసులు, సైబర్ క్రైమ్ కేసులు.ఈ లోక్ అదాలత్‌లో రాజీ చేసుకుని, కేసును పూర్తిగా క్లోజ్ చేసుకునే అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని న్యాయమూర్తి  తెలిపారు.

Blogger ఆధారితం.