కస్తూరిబా గాంధీ వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన న్యాయమూర్తి జి. భానుమతి
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి జి. భానుమతి బుధవారం జూలూరుపాడు లోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన సదుపాయాలు కల్పించాలని వార్డెన్స్‌ను ఆదేశించారు.
వసతి గృహంలోని తరగతి గదులు, కిచెన్ రూమ్, స్టోర్ రూమ్‌లను న్యాయమూర్తి పరిశీలించారు. పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని హాస్టల్ సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహార మెనూను పరిశీలించి, నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని హాస్టల్ వార్డెన్ మరియు ప్రిన్సిపాల్‌కు తెలిపారు.స్టాక్ రిజిస్టర్ సరిగ్గా మెయింటైన్ చేయని హాస్టల్ వార్డెన్‌పై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో న్యాయమూర్తితో పాటు డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి. నిరంజన్ రావు పాల్గొన్నారు.

Post a Comment