ఘనంగా ప్రారంభమైన జిల్లా పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్-2025

ఘనంగా ప్రారంభమైన జిల్లా పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్-2025


జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  హేమచంద్రపురం జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లోని క్రీడా మైదానంలో గురువారం జిల్లా పోలీసుల యాన్యువల్ స్పోర్ట్స్ మీట్-2025 ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని, జిల్లా పోలీస్ శాఖలోని విభాగాల వారీగా చేసిన అద్భుతమైన పరేడ్‌ను తిలకించారు. అనంతరం యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ఫ్లాగ్‌ను ఎస్పీ ఆవిష్కరించారు. భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్, ముఖ్య అతిథిగా హాజరై, ఎస్పీని స్పోర్ట్స్ మీట్‌ను ప్రారంభించాలని విజ్ఞప్తి చేయగా, ఎస్పీ జిల్లా యాన్యువల్ స్పోర్ట్స్ మీట్‌ను ప్రారంభించారు.


ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖలో పనిచేసే పోలీసులు నిత్యం తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారని తెలిపారు. విధుల నిర్వహణలో భాగంగా నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బందికి ఆటవిడుపు, మానసికోల్లాసం కోసం ఈ క్రీడలను నిర్వహిస్తున్నామని చెప్పారు.మూడురోజుల పాటు జరగనున్న ఈ క్రీడల్లో ఆసక్తిగల పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొంటారని, క్రికెట్, వాలీబాల్, చెస్, క్యారమ్స్, టగ్ ఆఫ్ వార్, కబడ్డీ, షటిల్ బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, 5 కిలోమీటర్ల పరుగు పందెం వంటి క్రీడలను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. గెలుపోటములు సహజమని, క్రీడాకారులందరూ స్పోర్టింగ్ స్పిరిట్‌తో ఆడాలని సూచించారు.

పోలీసు అధికారులు, సిబ్బంది తమ శారీరక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, మానసికోల్లాసానికి ఈ క్రీడలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ తెలిపారు. స్పోర్ట్స్ మీట్ పరేడ్ ఏర్పాట్లను అద్భుతంగా తయారుచేసిన అధికారులను అభినందించారు. అనంతరం, హోంగార్డ్స్ టీమ్ మరియు పాల్వంచ సబ్ డివిజన్ మధ్య జరిగిన వాలీబాల్ మ్యాచ్‌ను టాస్ వేసి ఎస్పీ ప్రారంభించారు.

Blogger ఆధారితం.