నల్సా స్కీమ్స్‌ను సమర్థవంతంగా నిర్వహించండి - న్యాయమూర్తి జి. భానుమతి

నల్సా స్కీమ్స్‌ను సమర్థవంతంగా నిర్వహించండి - న్యాయమూర్తి జి. భానుమతి

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  నల్సా స్కీమ్స్‌ను సమర్థవంతంగా నిర్వహించాలని పారాలీగల్ వాలంటీర్లకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి జి. భానుమతి సూచించారు. శుక్రవారం పారాలీగల్ వాలంటీర్లతో న్యాయమూర్తి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో పారాలీగల్ వాలంటీర్ల బాధ్యత కీలకమని, న్యాయాన్ని మరింత చేరువ చేయడం కోసం తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలని సూచించారు. కొత్తగూడెం జిల్లాలో ఉన్న వృద్ధాశ్రమాలు, మానసిక వికాస కేంద్రాలలో క్లినిక్‌ను ఏర్పాటు చేసి పారాలీగల్ వాలంటీర్లు అక్కడ సందర్శించి, వారికి ఉన్న సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం పాటుపడాలని సూచించారు.

ఏదైనా న్యాయ సంబంధిత సమస్యలు ఉంటే, వాటిని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కొత్తగూడెం దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. నల్సా స్కీమ్స్‌ను సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రతి పేదవాడు న్యాయం అందలేదని బాధపడాల్సిన అవసరం లేకుండా చూడాలని సూచించారు.

ఈ సమావేశంలో డిప్యూటీ కౌన్సిల్ పి. నిరంజన్ రావు, న్యాయవాదులు జి. రామచంద్ర రెడ్డి, షాజహాన్ పర్వీన్, జి. సునంద, మెండు రాజమల్లు, పార్వతి, మహాలక్ష్మి, పారాలీగల్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు

Blogger ఆధారితం.