ఆకట్టుకునేలా గ్రంథాలయ అధునాతన భవనం

ఆకట్టుకునేలా గ్రంథాలయ అధునాతన భవనం
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  గ్రంథాలయం కోసం ఏర్పాటు చేసిన నూతన భవనం కార్పొరేట్ స్థాయిలో ఆకట్టుకునేలా ఉందని విద్యానగర్ కాలనీ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కొల్లు నాగేశ్వరరావు, కార్యదర్శి సురేష్ కుమార్ అన్నారు.

మంగళవారం నూతన గ్రంథాలయ భవనాన్ని సందర్శించిన వారు అందుబాటులో ఉన్న సదుపాయాలు, సౌకర్యాలపై స్పందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా కార్పొరేట్ స్థాయిలో చక్కటి వాతావరణం, ఆహ్లాదకరమైన పరిస్థితుల నడుమ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.

ఈ నూతన భవనంలోని ఏర్పాట్లను చూస్తుంటే, ఇది నిజంగా ప్రభుత్వ కార్యాలయమేనేమో అనే అనుమానం కలగక మానదని తెలిపారు. ఇక్కడున్న సదుపాయాలను చూస్తుంటే వేరే రేంజ్‌లో ఉన్నట్లు అనిపిస్తుందని, విద్యార్థులు కూర్చుని చదువుకునేందుకు అన్ని రకాల పుస్తకాలను అందుబాటులోకి తేవడం గమనార్హమని పేర్కొన్నారు.

గ్రంథ పాలకురాలిగా పనిచేస్తున్న మణి మృదుల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి నిరంతరం అందుబాటులో ఉంటూ సహకారం అందిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇటీవల కాలంలో గ్రంథాలయంపై ఆధారపడి చదివిన అనేక మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం వెనుక గ్రంథ పాలకురాలి కృషి ఎంతో కీలకమని పేర్కొన్నారు.

గతంలో మాదిరిగానే నూతన గ్రంథాలయానికి కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి విశ్రాంత ఉద్యోగుల తరఫున సహకరిస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో బి. కేశవరావు, రాములు, శివరామకృష్ణ, గురుమూర్తి, సాంబయ్య, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.