నూకల రంగారావు మాతృమూర్తి మృతి పట్ల సంతాపం తెలిపిన కొత్వాల
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు మాతృమూర్తి ఇటీవల మృతి చెందారు. బుధవారం పాల్వంచ కాంట్రాక్టర్స్ కాలనీలోని నూకల రంగారావు స్వగృహానికి రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావుతోపాటు కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు వెళ్లి ఆయనను పరామర్శించారు. రంగారావు తల్లి మరణం పట్ల సంతాపం తెలిపి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీరహన్మంతరావు, పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న, సుజాతనగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు చింతలపూడి రాజశేఖర్, చుంచుపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆంతోటి పాల్, కాంగ్రెస్ నాయకులు చాంద్ పాషా, భూక్యా గిరి ప్రసాద్, దొప్పలపూడి సంతోష్, కట్టా సోమయ్య, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment