పాల్వంచలో పర్యటించిన మంత్రి పొంగులేటి

పాల్వంచలో పర్యటించిన మంత్రి పొంగులేటి
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్వంచలో గురువారం పర్యటించారు. పర్యటనలో భాగంగా స్థానికంగా ఉన్న పెద్దమ్మతల్లి ఆలయం, శివాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో సత్కరించారు.అదే విధంగా, స్థానిక ఫంక్షన్ హాల్లో జరిగిన బత్తుల అంజి సోదరుని కుమారుని వివాహానికి హాజరై పట్టు వస్త్రాలను కానుకగా సమర్పించారు. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం, ఇటీవల వివాహం జరిగిన నవీన్ దంపతులను కేశవాపురంలోని వారి ఇంటి వద్ద ఆశీర్వదించి, పట్టు వస్త్రాలను కానుకగా అందజేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన చీకటి కార్తీక్ గాంధీ భవన్‌లో శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసేందుకు వెళ్తూ, మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన టీం ఆధ్వర్యంలో మంత్రిని గజమాలతో ఘనంగా సత్కరించారు.డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. పలు ప్రైవేట్ కార్యక్రమాల్లోనూ పొంగులేటి పాల్గొన్నారు.ఈ పర్యటనలో మంత్రి వెంట ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్, జారే ఆదినారాయణ తదితరులు ఉన్నారు.



Blogger ఆధారితం.