అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలి - ముత్యాల విశ్వనాథం

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలి -  ముత్యాల విశ్వనాథం
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : అర్హులైన పేదలందరికీ షరతులు లేకుండా సంక్షేమ పథకాలు అందించాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం అన్నారు. గురువారం పాల్వంచ మండల పరిధిలోని కారేగట్టు, సారకల్లు గ్రామాలలో సీపీఐ శాఖ మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన విశ్వనాథం మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ షరతులు లేకుండా సంక్షేమ పథకాలు అందించాలని, రాష్ట్ర ప్రభుత్వం 4 గ్యారెంటీల అమల కోసం నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభలో ప్రకటించిన అర్హత జాబితాలో సాంకేతిక కారణాలతో అనేక మంది పేదలకు ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్ కార్డులు, రైతు భరోసా పథకాల జాబితాలో పేర్లు రాలేదని అన్నారు. అధికార యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ, అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా సర్వే చేపట్టాలని కోరారు.

కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సహకారంతో పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు సీపీఐ కృషి చేస్తుందని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సీపీఐ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

సీపీఐ వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీ అని, మరో వందేళ్లైనా ప్రజాక్షేత్రంలో చెక్కుచెదరకుండా కొనసాగుతుందని అన్నారు. నిరంతరం సమరశీల పోరాటాలు సాగిస్తున్న సీపీఐ, ఒక్క ప్రాంతానికో లేదా ఒక్క వర్గానికో పరిమితమైన పార్టీ కాదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, పార్టీ పటిష్ఠత కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని, స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతి పంచాయతీలో సీపీఐకు ప్రాతినిధ్యం వచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

అంతకుముందు కారేగట్టు సీపీఐ నూతన శాఖ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.


ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, జిల్లా సమితి సభ్యులు ఉప్పుశెట్టి రాహుల్, నాయకులు నిమ్మల రాంబాబు, చెన్నయ్య, కొంగర అప్పారావు, మాజీ ఎంపీటీసీ ఉండ్రాతి రవి, నురా గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. శాఖ కార్యదర్శిగా కోరం చంద్రశేఖర్, సహాయ కార్యదర్శిగా షణ్ముఖ చారి నల్ల, మోసు నరసింహారావు, కొత్త సురేష్ రెడ్డి, వాసం యాదగిరి, సర్ప శ్రీకాంత్, మడివి అజయ్, వెంకన్న, నర్సిరెడ్డి తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.