మంత్రి పొంగులేటికి ఎం.కె.ఎం ఫౌండేషన్ ఆహ్వానం
జె.హెచ్.9. మీడియా, హైదరాబాద్ : ఎం.కె.ఎం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14న సికింద్రాబాద్ వారాసిగూడలో జరగనున్న రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార, ప్రజా సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని సోమవారం హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో గల ఆయన నివాసంలో ఎం.కె.ఎం ఫౌండేషన్ సభ్యులు కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎం.కె.ఎం ఫౌండేషన్ ఫౌండర్ పి. మురళీ కృష్ణ, సభ్యులు మొహమ్మద్ అజీమ్, ఆర్. శివప్రసాద్, జి. సాయి ఆకాష్ యాదవ్, ఎం. శివశంకర్, జి. హర్వింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment