పేద, మధ్యతరగతి ప్రజలకు అండగా ఉండే పార్టీ సీపీఐ - ముత్యాల విశ్వనాథం
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : పేద, మధ్యతరగతి ప్రజలు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారని, వారి తరఫున పోరాడి సమస్యలు పరిష్కరించేందుకు భారత కమ్యూనిస్టు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ముత్యాల విశ్వనాథం అన్నారు.సోమవారం పాల్వంచ మండలం ప్రభాత్ నగర్‌లో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) గ్రామ శాఖ మహాసభ నిర్వహించి, నూతన కమిటీని ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా ముత్యాల విశ్వనాథం మాట్లాడుతూ... కమ్యూనిస్టులు విశాల దృక్పథం కలిగి ఉంటారని, సీపీఐ పార్టీ భారతదేశంలో ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తయిందని, ఇప్పటివరకు దేశంలో ఏ పార్టీకి 100 సంవత్సరాల చరిత్ర లేదు అని పేర్కొన్నారు. ప్రజల్లో మమేకమై అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించిన సీపీఐ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలో 10 లక్షల ఎకరాల భూస్వాముల భూములను పేదలకు పంచిపెట్టిన ఘనత సాధించింది అని తెలిపారు.
పేద, మధ్యతరగతి ప్రజలు అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారని, వారి తరఫున పోరాడి సమస్యలు పరిష్కరించేందుకు భారత కమ్యూనిస్టు పార్టీ అండగా ఉంటుందని ఆయన అన్నారు.
సభలో 15 మంది సభ్యులతో నూతన శాఖ కమిటీని ఏర్పాటు చేశారు. శాఖ కార్యదర్శిగా బోళ్ల ఉపేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శులుగా రేగు కృష్ణమూర్తి, గొనె క్రాంతిని ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు.
ఈ సమావేశంలో సీపీఐ పాల్వంచ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచందర్రావు, సీపీఐ మండల నాయకులు నిమ్మల రాంబాబు, శనిగారపు శ్రీనివాసరావు, ఆవుల సతీష్, వేల్పుల లింగయ్య, జి. వెంకన్న చారి, సోమ రామిరెడ్డి, నారాయణరెడ్డి, అనిల్, హేమలత, బోళ్ల జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment