ఆలయ ప్రాంగణంలో విస్తృతంగా తులసి మొక్కలు నాటాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

ఆలయ ప్రాంగణంలో విస్తృతంగా తులసి మొక్కలు నాటాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ భద్రాచలం అనుబంధ ఆలయం అయిన పర్ణశాల ఆలయాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ ప్రాంగణం మొత్తం ఔషధ మొక్కలైన తులసి మొక్కలను విస్తృతంగా నాటాలని, అందుకోసం దేవస్థానం వారు సూచించిన ప్రదేశాన్ని పరిశీలించారు. స్థానిక పంచాయతీ అధికారుల సహకారంతో తులసి మొక్కలను నాటాలని సూచించారు.

పర్ణశాల ఆలయం ప్రక్కన గల దారి మొత్తం షాపులతో క్రిక్కిరిసినందున, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, పర్ణశాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయ రాకపోకలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు, షాపులను వేరొక ప్రాంతానికి మార్చేలా సరైన ప్రణాళికలు సిద్ధం చేయాలని పంచాయతీ మరియు దేవస్థానం అధికారులను ఆదేశించారు.

ఆలయం ఎదుట విప్ప పువ్వులు అమ్ముకునే వారి వద్ద ఆగి, వారి నుంచి వివరాలు తెలుసుకుని కొంత విప్ప పువ్వును కొనుగోలు చేశారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు భద్రాచలం దేవస్థానం ఈవో రమాదేవి, దేవస్థానం ఈఈ, పంచాయతీ సెక్రటరీ, పర్ణశాల ఆలయ ఇన్‌చార్జి తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.