ఇసుక రీచ్‌లను పరిశీలించిన జిల్లా కలెక్టర్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : చర్ల మండలం చింతకుంట, మొగళ్లపల్లి ఇసుక రీచ్‌లను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇసుక రీచ్‌లలో స్టాక్ రిజిస్టర్‌ను, స్టాక్ పాయింట్‌ను పరిశీలించారు. ఇసుక రీచ్‌లో లోడింగ్ చేస్తున్న ట్రాక్టర్ మరియు లారీల లోడింగ్ వివరాలను అక్కడ పని చేస్తున్న వారిని అడిగి తెలుసుకున్నారు. ఇసుక రీచ్‌లో రోజువారీ ఎన్ని లారీలు లోడింగ్ అవుతున్నాయి అనే విషయాన్ని గ్రూప్ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఇసుక రీచ్‌లో ఉన్న ఇసుక నిల్వలను పరిశీలించారు. సొసైటీ సభ్యుల పని వేళలు మరియు వే బిల్లుల తనిఖీ సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అనుమతుల్లేకుండా ఇకపై ఇసుక ఎవరైనా తీసుకువెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతుల్లేకుండా ఇసుక తీసుకువెళ్లకూడదన్నారు.
ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట చర్ల తహసిల్దార్ ఎం. శ్రీనివాస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Post a Comment