మాలోత్ సింధును సన్మానించిన జిల్లా కలెక్టర్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : 38వ జాతీయ క్రీడా పోటీలలో భాగంగా ఫిబ్రవరి 9న ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్‌లో జరిగిన 4×100 రిలే అథ్లెటిక్స్ విభాగంలో భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు చెందిన మాలోత్ సింధు కాంస్య పతకం సాధించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ శనివారం ఐ.డి.ఓ.సి కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్‌లో ఆమెను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడాకారుల్లో ఇమిడి ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి వెలికితీయాలని సూచించారు. జాతీయ స్థాయిలో జిల్లాకు గుర్తింపు తెచ్చినందుకు మాలోత్ సింధును ప్రత్యేకంగా అభినందిస్తూ, ₹25,000 చెక్కును అందజేశారు.జాతీయ స్థాయి క్రీడల్లో రాణించడానికి ప్రోత్సహించిన మాలోత్ సింధు కోచ్ నరేష్ మరియు ఆమె తండ్రి మాలోత్ లక్ష్మణ్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాధికారి ఎం. పరంధామ రెడ్డి, అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ మహీధర్, జాయింట్ సెక్రటరీ మల్లికార్జున్, డిస్ట్రిక్ట్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ యుగంధర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు, న్యూ స్టార్ క్లబ్ ప్రెసిడెంట్ & సీనియర్ ప్లేయర్ ఎం.డి. బాబ్జి, కార్యాలయ సిబ్బంది తిరుమల రావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment