వలస ఆదివాసీలకు కనీస సౌకర్యాలు కల్పించాలి - సీపీఐ నేత ముత్యాల విశ్వనాథం
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : వలస ఆదివాసీలకు కనీస సౌకర్యాలు కల్పించాలని సీపీఐ జిల్లా రాష్ట్ర సమితి సభ్యుడు ముత్యాల విశ్వనాథం అన్నారు. పాల్వంచ మండలం ప్రభాత్ నగర్ ఎస్టీ కాలనీలో సీపీఐ పార్టీ గ్రామ శాఖ మహాసభ ఎం. అడమయ్య అధ్యక్షతన శనివారం నిర్వహించారు.
ఈ సభకు ముఖ్య అతిథిగా సీపీఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు ముత్యాల విశ్వనాథం హాజరై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో ప్రతి పౌరునికి సమాన హక్కులు ఉన్నప్పటికీ, పక్క రాష్ట్రం నుండి గత 30 సంవత్సరాల క్రితం ఇక్కడకు వచ్చిన వలస ఆదివాసీల గ్రామాలకు ఇప్పటికీ రహదారులు, విద్యుత్, మంచినీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.అదేవిధంగా, ఫారెస్ట్, పోలీస్ అధికారుల దౌర్జన్యాలను ఆపాలని, ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు, కులం, ఆదాయం సర్టిఫికెట్లు మంజూరు చేయాలని ఆయన కోరారు. "ఆపరేషన్ కగార్" పేరుతో కేంద్ర ప్రభుత్వం పారా మిలిటరీ పోలీసులను ఆదివాసీ గ్రామాల్లోకి దింపి, ఇండ్లను ధ్వంసం చేయడం, ఆస్తులను లూటీ చేయడం, బూటకపు ఎన్‌కౌంటర్ల పేరుతో ఆదివాసీలను హత్య చేయడం తీవ్రంగా ఖండించదగిన విషయం అని ఆయన విమర్శించారు.
ఈ దుర్మార్గపు వైఖరిని విడనాడాలని, ఆదివాసీల హక్కులను కాపాడేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించి, కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు.
అనంతరం సీపీఐ పార్టీ గ్రామ నూతన కమిటీని ఎన్నిక చేశారు.
ఈ కమిటీలో: కార్యదర్శిగా ఎం. అడమయ్య
సహాయ కార్యదర్శిగా పోడియం అంజయ్య
రైతు సంఘం కార్యదర్శిగా సోడె రామచందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ పాల్వంచ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచందర్‌రావు, సీపీఐ నాయకులు నిమ్మల రాంబాబు, ఆవుల సతీష్, బోళ్ల ఉపేందర్ రెడ్డి, రేగు కృష్ణమూర్తి, తొట్ల బాల నర్సయ్య, నారి రాములు, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment