వేదగణితం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం - ఐటీడీఏ పీవో రాహుల్

వేదగణితం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం - ఐటీడీఏ పీవో రాహుల్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  పాల్వంచ మండలం ఆదర్శ గిరిజన క్రీడా పాఠశాల, కిన్నెరసానిలో భద్రాచలం ఐటీడీఏ పీవో బి. రాహుల్ ఐఏఎస్ ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా పాఠశాలలో ఏడవ తరగతి విద్యార్థులతో తరగతి గదిలో నల్లబల్లపై వేదగణితం నిర్వహించారు. విద్యార్థులను విడిగా వేదగణితం చేయమని సూచించగా, వారు వాటిని బోర్డుపై రాసి చూపించారు.

అనంతరం ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఐఏఎస్ విద్యార్థులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం, పాఠశాల ప్రధానోపాధ్యాయులకు రాత్రివేళల్లో కూడా వేదగణితం ప్రాక్టీస్ చేయించాలని సూచించారు. అదేవిధంగా, సైన్స్ ల్యాబ్‌ను పరిశీలించి, ఎక్స్‌పైరీ డేట్ గల రసాయనాల గురించి ప్రశ్నించారు. సైన్స్ ల్యాబ్‌కు సంబంధించిన మెటీరియల్స్ అవసరమైతే తెలియజేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏటీడీవో చంద్రమోహన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లొడిగా రామారావు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

Blogger ఆధారితం.