నూకల రంగారావును పరామర్శించిన వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల రంగారావు మాతృమూర్తి ఇటీవల మృతి చెందిన సందర్భంగా ఆదివారం పలువురు కాంగ్రెస్ నేతలు ఆయనను పరామర్శించారు. పాల్వంచ కాంట్రాక్టర్స్ కాలనీలోని రంగారావు స్వగృహానికి వెళ్లి వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు జేబీ శౌరి, జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ ఎల్లంకి వెంకటేశ్వరరావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏనుగుల అర్జున్ రావు, జిల్లా కాంగ్రెస్ అణగారిన వర్గాల అధ్యక్షుడు అల్లాడి నరసింహరావు, చుంచుపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అంతోటి పౌల్, యువజన కాంగ్రెస్ నాయకుడు మాలోత్ విగ్నేష్ నాయక్‌తో పాటు కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఆయనను పరామర్శించారు.
రంగారావు తల్లి మరణం పట్ల సంతాపం తెలుపుతూ, వారి చిత్రపటానికి పూలమాలలు అర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Post a Comment