శ్రీ చైతన్య హైస్కూల్‌లో 'సైన్స్ ఎక్స్ పో' సందడి

శ్రీ చైతన్య హైస్కూల్‌లో 'సైన్స్ ఎక్స్ పో' సందడి
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  పాల్వంచ పట్టణంలోని కాంట్రాక్టర్స్ కాలనీలో ఉన్న శ్రీ చైతన్య హైస్కూల్‌లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం 'సైన్స్ ఎక్స్ పో' నిర్వహించారు. విద్యార్థులు తమ సృజనాత్మకతను ప్రదర్శిస్తూ అద్భుతమైన సైన్స్ ప్రాజెక్టులను రూపొందించారు. టెస్లా కాయిల్, పెండ్యూలమ్, హైడ్రాలిక్ బ్రేక్, వాటర్ లెవల్ ఇండికేటర్, ఫైర్ అలారం, బ్లడ్ గ్రూప్స్, బ్లడ్ సర్క్యూలేషన్, హ్యూమన్ హార్ట్, సిగరెట్ వల్ల కలిగే హానీలు, వాటర్ ప్యూరిఫికేషన్, డెన్సిటీ ఎక్స్పరిమెంట్, సోలార్ ఎనర్జీ, ఎర్త్ క్వేక్ అలారం, చంద్రయాన్-3 మోడల్‌ తదితర ప్రాజెక్టులు వీక్షకులను ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమానికి పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి. పద్మ, కెమిస్ట్రీ ప్రొఫెసర్ డాక్టర్ జె.మాధవి ముఖ్య అతిథులుగా హాజరై, విద్యార్థుల ప్రాజెక్టులను పరిశీలించి అభినందించారు. స్కూల్ ప్రిన్సిపల్ రమ్య, డీన్ మధు, సి. ఇంచార్జ్ నాగబాబు, ప్రైమరీ ఇంచార్జ్ రేణుకతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Blogger ఆధారితం.