స్టార్ చిల్డ్రన్ స్కూల్‌లో జాతీయ సైన్స్ డే వేడుకలు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : పాల్వంచ పట్టణంలోని స్టార్ చిల్డ్రన్ హైస్కూల్‌లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జి. శ్రీనివాస్ రెడ్డి, సైన్స్ అధ్యాపకులు జి. స్వరూప రాణి, ఎస్. ప్రశాంతి భౌతిక శాస్త్రంలో సి.వి. రామన్ చేసిన విశేష సేవలను కొనియాడారు. సైన్స్ లేని ప్రపంచాన్ని ఊహించలేమని, భారతీయ శాస్త్రవేత్తల ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో చాటిన గొప్ప వ్యక్తి సి.వి. రామన్ అని పేర్కొన్నారు.
స్కూల్ కరస్పాండెంట్ జి. భాస్కరరావు మాట్లాడుతూ వైజ్ఞానిక రంగంలో సి.వి. రామన్ చేసిన సాహసోపేత ప్రయాణం భారత కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందని ప్రశంసించారు. అనంతరం సైన్స్ అధ్యాపకులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఝాన్సీ, గీత, మహేశ్వరి, సత్య ప్రసాద్, స్వాతి, శ్వేత, లక్ష్మి, సుల్తానా తదితరులు పాల్గొన్నారు.

Post a Comment