వర్కింగ్ జర్నలిస్టులందరికీ ప్రమాద బీమా అవసరం - వరంగల్ జిల్లా కలెక్టర్

వర్కింగ్ జర్నలిస్టులందరికీ ప్రమాద బీమా అవసరం - వరంగల్ జిల్లా కలెక్టర్
జె.హెచ్.9. మీడియా, వరంగల్ :  వర్కింగ్ జర్నలిస్టులందరికీ ప్రమాద బీమా ఎంతో అవసరమని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. శుక్రవారం వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టీ.ఎస్.జే.యు రాష్ట్ర అధ్యక్షుడు నారగోని పురుషోత్తం గౌడ్ ఆధ్వర్యంలో, వరంగల్ టీ.ఎస్.జే.యు యూనియన్ సభ్యులందరికీ ఐదు లక్షల ఉచిత ప్రమాద బీమా సౌకర్యానికి సంబంధించిన బీమా పత్రాలను జిల్లా కలెక్టర్ సత్య శారద చేతుల మీదుగా సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిత్యం విధి నిర్వహణలో భాగంగా ఎంతో మంది జర్నలిస్టులు ప్రమాదాలకు గురై ఇబ్బందులు పడుతుంటారని, ఆ సమయంలో వీరికి ప్రమాద బీమా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. టీ.ఎస్.జే.యు ఆధ్వర్యంలో జర్నలిస్టులందరికీ ప్రమాద బీమా కల్పించడం నిజంగా అభినందించదగ్గ విషయం అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టీ.ఎస్.జే.యు రాష్ట్ర అధ్యక్షుడు నారగోని పురుషోత్తం గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, సహాయ కార్యదర్శి రావుల నరేష్, జిల్లా అధ్యక్షుడు కందికొండ మోహన్, ప్రధాన కార్యదర్శి ఆవునూరి కుమారస్వామి, ఉపాధ్యక్షులు లింగబత్తిని కృష్ణ, కందికొండ గంగరాజు, ఈద శ్రీనాథ్, బత్తుల సత్యం, సభ్యులు కౌడగాని మోహన్ రావు, నీరుటి శ్రీహరి, అడుప అశోక్, మంతెన సురేష్, అవినాష్, బొక్క రాజు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.