ఖమ్మం డీసీఎంఎస్ ద్వారా 4.13 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు - కొత్వాల

ఖమ్మం డీసీఎంఎస్ ద్వారా 4.13 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు - కొత్వాల
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : ఉమ్మడి ఖమ్మం జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) ద్వారా 2024-2025 వానాకాలం వరి ధాన్యం 4.13 లక్షల క్వింటాళ్లకు గాను ₹116.49 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశామని రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు తెలిపారు.

ఖమ్మంలోని డీసీఎంఎస్ కార్యాలయంలో మంగళవారం కొత్వాల ధాన్యం కొనుగోలు వివరాలను వెల్లడించారు. ఖమ్మం జిల్లాలోని 29 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 3.18 లక్షల క్వింటాళ్లకు గాను ₹89.71 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశామని చెప్పారు. భద్రాద్రి జిల్లాలోని 11 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 94,960 క్వింటాళ్లకు గాను ₹26.78 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు.

ఈ సీజన్‌లో మొత్తం సన్న, దొడ్డు రకాల వరి ధాన్యాన్ని రైతుల వద్ద నుండి కొనుగోలు చేసి, రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. భద్రాద్రి జిల్లాలో ఈ సీజన్‌ నుండే ధాన్యం కొనుగోళ్లు చేపట్టామని, రాబోయే సీజన్‌లో కొనుగోలు కేంద్రాలను మరింత విస్తరిస్తామని కొత్వాల అన్నారు.


ఈ కార్యక్రమంలో కొత్వాలతో పాటు డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ సందీప్ పాల్గొన్నారు.

Blogger ఆధారితం.