అండర్ 14 టెన్నిస్ జోనల్ మీట్ లో ప్రతిభ చూపిన చిన్నారులు..కలెక్టర్ అభినందనలు

అండర్ 14 టెన్నిస్ జోనల్ మీట్ లో ప్రతిభ చూపిన చిన్నారులు..కలెక్టర్ అభినందనలు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  జోనల్ మీట్ టెన్నిస్ క్రీడల్లో ప్రతిభ చూపిన చిన్నారులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్  అభినందించారు. జనవరి 24, 25 తేదీల్లో ఖమ్మంలోని శ్రీ చైతన్య గ్లోబల్ విస్టా స్కూల్ ఆధ్వర్యంలో జోనల్ మెట్ క్రీడలు జరిగాయి.అండర్-14 టెన్నిస్ విభాగంలో నారాయణ స్కూల్ ఆరవ తరగతి విద్యార్థిని ప్రవసి ప్రథమ బహుమతి, నవభారత్ పబ్లిక్ స్కూల్ ఏడవ తరగతి విద్యార్థిని బొమ్మ భాను శ్రీ ద్వితీయ బహుమతి సాధించారు. అలాగే, ఆల్ ఇండియా టెన్నిస్ టోర్నమెంట్ 55+ వయస్సు విభాగంలో ద్వితీయ బహుమతి గెలుచుకున్న ఒలంపిక్ టెన్నిస్ అసోసియేషన్ చీఫ్ కోచ్ అన్నం వెంకటేశ్వర్లును కలెక్టర్ అభినందించారు.


ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టెన్నిస్ కోచ్ పై మరింత బాధ్యతలు పెరిగాయని, క్రీడలకు అవసరమైన సామగ్రి కోసం అసోసియేషన్ సహాయాన్ని పొందవచ్చని తెలిపారు.ఇదే సందర్భంగా ఫిబ్రవరి 6 నుంచి 9 వరకు కొత్తగూడెం హనుమాన్ బస్తి ఇండోర్ స్టేడియంలో 35 నుంచి 85 సంవత్సరాల వయస్సు గల క్రీడాకారుల కోసం రాష్ట్ర స్థాయి వెట్రన్ బ్యాడ్మింటన్ పోటీలు జరుగనున్నట్లు వెల్లడించారు. ఈ పోటీలకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా ఆహ్వానించబడినట్లు నిర్వాహకులు తెలిపారు.


ఈ కార్యక్రమంలో ఒలంపిక్ జిల్లా అసోసియేషన్ సెక్రటరీ ఆర్. రాజేంద్రప్రసాద్, టెన్నిస్ కోచ్ డేనియల్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


Blogger ఆధారితం.