TVEU.H-82 యూనియన్ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన సి.ఈ.లు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : టి.వి.ఇ.యు.హెచ్-82 యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం కేటీపీఎస్ కాంప్లెక్స్‌లో 2025 సంవత్సరానికి ఆ యూనియన్ కు చెందిన క్యాలెండర్‌ను కేటీపీఎస్ సి.ఈ.లు వెంకటేశ్వరరావు, ప్రభాకరరావు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సి.ఈ.లు మాట్లాడుతూ "యూనియన్లు ఎల్లప్పుడూ సంస్థ ప్రయోజనాల కోసం పాటుపడాలి. సంస్థను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేయాలి. కార్మికుల సమస్యల పట్ల యాజమాన్యం ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంటుంది. ఏ సమస్య ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలి. వాటి పరిష్కారానికి యాజమాన్యం అన్ని విధాలుగా సహాయపడుతుంది" అని తెలిపారు. అదనంగా, కార్మికులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టి.వి.ఇ.యు.హెచ్-82 జెన్కో అధ్యక్ష కార్యదర్శులు ఉండేటి జయరాజు, ఆవుల కృష్ణారెడ్డి, నాయకులు ఎం.డి. మసూద్, అనిల్ కుమార్, కేసరి రవీందర్, మహేశ్వరం శ్రీనివాస్, జామ్లా రాంబాబు, శ్రీను, మోయిన్, శ్రీశైలం, సురేష్, యాదగిరి, హరి, దాస్, రవీందర్, రాంబాబు దస్రు, వీరన్న, పరమేష్, కృష్ణ, రమేష్, సత్యం తదితరులు పాల్గొన్నారు.

Post a Comment