పేద ప్రజలు, కష్టజీవులు, కార్మికుల పార్టీ సిపిఐ - ముత్యాల విశ్వనాథం

పేద ప్రజలు, కష్టజీవులు, కార్మికుల పార్టీ సిపిఐ - ముత్యాల విశ్వనాథం

 జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  పేద ప్రజలు, కష్టజీవులు, కర్షకులు, కార్మికుల పార్టీ సిపిఐ అని, సుదీర్ఘ పోరాటాలు, త్యాగాలతో నిర్మితమైన ఎర్రజెండా పార్టీకి ఎదురులేదని, మరో వందేళ్లైనా చెక్కుచెదరకుండా అజేయంగా నిలుస్తుందని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం అన్నారు. మంగళవారం నాగారం కాలనీలో సిపిఐ శాఖ మహాసభ నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఐకి వందేళ్ల చరిత్ర ఉందని, మరో వందేళ్లైనా చెక్కుచెదరకుండా ప్రజాక్షేత్రంలో మనగలుగుతుందని అన్నారు. నిరంతరం సమరశీల పోరాటాలు సాగిస్తున్న సిపిఐ ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో పరిమితమైన పార్టీ కాదని స్పష్టం చేశారు. ప్రజలకు సేవలందించేందుకు పురుడుపోసుకున్న పార్టీకి ప్రతినిధులుగా పనిచేయడం అదృష్టంగా కార్యకర్తలు భావించాలన్నారు. పాల్వంచ మండలంలో సిపిఐకి ఎదురులేదని, ఇది ప్రజలకు అందించిన సేవల ఫలితమని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారంకోసం, పార్టీ పటిష్ఠతకోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని తెలిపారు. స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయటానికి కృషి చేస్తున్నారని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, ప్రతి పంచాయతీలో సిపిఐకి ప్రాతినిధ్యం వచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, సిపిఐ మండల నాయకులు నిమ్మల రాంబాబు, ముత్యాల కిరణ్ కుమార్, లాల్ పాషా, సపవత్ వెంకటరమణ, సుంకర రంగారావు, తేజావత్ హరియా, సపవత్ హరియ, భూక్య మంగు, భూక్య అశోక్ కుమార్, కృష్ణ వినోద్, చంద్రయ్య, వీరాచారి, భూక్య బాలు, తేజావత్ పద్మ, వినోద్, భూక్య బాలు, ఆలకుంట్ల సారయ్య తదితరులు పాల్గొన్నారు.


అనంతరం 15 మందితో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శాఖ కార్యదర్శిగా సపవత్ వెంకటరమణ, సహాయ కార్యదర్శిగా సుంకర రంగారావు తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.


Blogger ఆధారితం.