ఆందోళన వద్దు.. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియ: నూకల రంగారావు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ఎవరు ఆందోళన చెందవద్దని పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు అన్నారు.
మంగళవారం శేఖరం బంజర, నవభారత్ గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభలను సందర్శించి, అక్కడ దరఖాస్తు పత్రాలను ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు గ్రామసభల్లో ప్రకటించిన జాబితా కేవలం అర్హులైన వారి పేర్లకు సంబంధించినదని, దశలవారీగా ఇళ్ల మంజూరు కొనసాగుతుందని వివరించారు. దరఖాస్తు చేయని వారు మళ్లీ గ్రామసభల్లో దరఖాస్తులు సమర్పించుకోవాలని సూచించారు. గ్రామసభల్లో మున్సిపల్ సిబ్బంది చేసిన ఏర్పాట్ల పట్ల నూకల రంగారావు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ LV సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు బాలు నాయక్, బానోత్ రాము నాయక్, సతీష్, ఇమ్మానుయేల్, జల్లారపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment