ఘనంగా ఐఎల్పిఏ క్యాలెండర్ ఆవిష్కరణ
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : ఇల్లందులో ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ILPA) క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐఎల్పిఏ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కన్వీనర్, సీనియర్ న్యాయవాదులు జనపరెడ్డి గోపికృష్ణ, పుప్పాల గోపీనాథ్, వి. నాగేశ్వరరావు, దంతాల ఆనంద్ హాజరై క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, న్యాయ వృత్తిలో ప్రామాణికతను పెంపొందించడమే కాకుండా, న్యాయవాదుల హక్కులను కాపాడుతూ వారి సమస్యలకు పరిష్కారం చూపడం, అలాగే సామాజిక న్యాయం కోసం పాటుపడటమే ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ లక్ష్యాలు అని పేర్కొన్నారు. ఐఎల్పిఏ ఒక శక్తివంతమైన వేదికగా నిలిచి, న్యాయవాదుల ఐకమత్యం, వృత్తిపరమైన విలువల పరిరక్షణ, సామాన్య ప్రజలకు న్యాయసేవలు మరింత అందుబాటులో ఉండేలా చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తోందని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో పలమల బాలకృష్ణ, టీ. ఉమా మహేష్, జనరల్ సెక్రటరీ కంపెల్లి ఉమా మహేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ కీర్తి కార్తీక్, నవీన్, కొత్తగూడెం బార్ అసోసియేషన్ సభ్యులు మరపాక రమేష్ కుమార్, వడ్లకొండ హరీ ప్రసాద్, యాస యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment