కేటీపీఎస్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి – బద్ధి కిషోర్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : కేటీపీఎస్ 5,6 దశల్లో పనిచేసిన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డిని పాల్వంచ పట్టణ కాంగ్రెస్ నాయకుడు, ఎల్‌డీఎం కోఆర్డినేటర్ బద్ధి కిషోర్ కుమార్ కోరారు. బుధవారం హైదరాబాద్‌లో ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డిని ఆయన నివాసంలో బద్ధి కిషోర్ కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ పాల్వంచలోని కేటీపీఎస్‌లో 8వ దశ కర్మాగారం నిర్మించాలని కోరారు. అదేవిధంగా 5,6 దశల్లో పనిచేసిన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఎంపీని కోరారు.

Post a Comment