బ్యాంకులు సరైన భద్రతను ఏర్పాటు చేసుకోవాలి - ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్
ఏటీఎంలో నగదును లోడ్ చేసేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, అక్కడ సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సూచించారు. సామాజిక బాధ్యతలో భాగంగా సైబర్ క్రైమ్స్ పై బ్యాంకుల తరఫున జిల్లా ప్రజలకు నిత్యం అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందులో భాగంగా కరపత్రాలు, పోస్టర్లను తయారుచేసి ముఖ్యమైన ప్రదేశాల్లో అతికించాలని సూచించారు.
సైబర్ నేరాల బారిన పడి నగదును కోల్పోయిన బాధితులకు నేరగాళ్ల ఖాతాల్లో ఫ్రీజ్ చేయబడిన నగదును త్వరితగతిన వారికి అందేలా పోలీస్ శాఖతో సమన్వయం పాటిస్తూ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఇన్సూరెన్స్ స్కీములకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించి, వారు జీవిత బీమాలు చేసుకునే విధంగా ప్రచారం చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ సింగ్ ఐపీఎస్, ఇల్లందు డీఎస్పీ చంద్రభాను, కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ నాగరాజు, సైబర్ క్రైమ్స్ ఇన్‌స్పెక్టర్ జితేందర్, జిల్లాలోని అన్ని బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.

Post a Comment