స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలి - సిపిఐ
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిపిఐది వందేళ్ల చరిత్ర అని, మరో వందేళ్లైనా చెక్కుచెదరకుండా ప్రజాక్షేత్రంలో నిలిచిపోవగలమన్నారు. నిరంతరం సమరశీల పోరాటాలు సాగిస్తున్న సిపిఐ ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో పరిమితమైన పార్టీ కాదని స్పష్టం చేశారు. ప్రజలకు సేవలందించేందుకు పురుడుపోసుకున్న పార్టీకి ప్రతినిధులుగా పనిచేయడం అదృష్టంగా కార్యకర్తలు భావించాలన్నారు. పాల్వంచ మండలంలో సిపిఐకి ఎదురులేదని, ఇది ప్రజలకు అందించిన సేవల ఫలితమేనన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంకోసం, పార్టీ పటిష్ఠతకోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామన్నారు. స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయటానికి కృషి చేస్తున్నారని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, ప్రతి పంచాయతీలో సిపిఐకు ప్రాతినిధ్యం వచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, ఏఐటీయూసీ మండల కార్యదర్శి ఇట్టి వెంకట్రావు, నిమ్మల రాంబాబు, జరుపుల మోహన్, మాజీ సర్పంచ్ బాదావత్ శాంతి, బాదావత్ శ్రీను, జరుపుల బాలకృష్ణ, జరుపుల కిషన్, జరుపుల హనుమంత్ కుమార్, గుగులోత్ సాయిరాం, సుభాష్, చిట్టి లక్ష్మి, మంగళ సురేష్, ఈదర నాంచార్రాజు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment