కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం - డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం - డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని, రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం అని రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.


తల్లాడ మండలం పరిధిలోని గంగదేవిపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన కార్యాలయ భవనం, గోదాముల ప్రారంభోత్సవ సందర్భంగా గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించగా, సత్తుపల్లి శాసనసభ్యులు మట్టా రాగమయి, డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావుతో పాటు రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ రైతుల బాగోగుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక పథకాలు చేపట్టారని తెలిపారు. ఒకే దఫా రూ. 2 లక్షల రుణమాఫీ, క్వింటాలకు రూ. 500 బోనస్, త్వరలో ఎకరానికి రూ. 12 వేల రైతు భరోసా వంటి రైతు శ్రేయస్సు కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. రైతులకు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వానికి రైతులు సంపూర్ణ మద్దతు తెలపాలని కోరారు.


ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు వీరభద్రరావు, ఖమ్మం డీసీఓ గంగాధర్, డీసీసీబీ సీఈఓ, డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ సందీప్, రైతు సంఘం నాయకులు నల్లమల్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.