పెద్దమ్మతల్లికి ఘనంగా పంచామృతాభిషేకం
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :పాల్వంచ మండలం కేశవాపురం-జగన్నాధపురం గ్రామంలో వెలసియున్న శ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మగుడి) నందు శుక్రవారం అమ్మవారికి అర్చకులు పంచామృతాలతో వైభవంగా అభిషేకం నిర్వహించారు. ముందుగా మేళతాళాలతో దేవస్థాన అర్చకులు, భక్తులు జన్మస్థలం వద్ద ఉన్న అమ్మవారికి పంచామృతాలు, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు.
అనంతరం దేవాలయంలోని అమ్మవారి మూలవిరాటుకు పంచామృతాలతో అభిషేకం చేసి పంచ హారతులు, నివేదన, నీరాజన, మంత్రపుష్పం తదితర పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.

Post a Comment