గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ముత్తుట్ మిని ఫైనాన్సర్స్ గోల్డ్ లోన్ చేయూత

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ముత్తుట్ మిని ఫైనాన్సర్స్ గోల్డ్ లోన్ చేయూత
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ముత్తుట్ మిని ఫైనాన్సర్స్ గోల్డ్ లోన్ నిర్వాహకులు తమ చేయూతను అందించారు. శుక్రవారం పాల్వంచ మండల పరిధి రంగాపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ఆర్ఎం వేంకటాద్రి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని అన్నారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో ఎంతో ప్రతిభ దాగి ఉంటుందని, నేడు ప్రతి పరీక్షలో వారు సత్తా చూపుతున్నారని గుర్తు చేశారు.


ఈ కార్యక్రమంలో ముత్తుట్ మిని ఫైనాన్సర్స్ గోల్డ్ లోన్ - పాల్వంచ మేనేజర్ ఎన్. రమేష్, కొత్తగూడెం బ్రాంచ్ మేనేజర్ సత్యనారాయణ, సిబ్బంది నజీమ్, పాఠశాల ఉపాధ్యాయులు శశికుమార్, అంగన్వాడీ టీచర్ ఉమ, స్థానికులు వీరన్న, రమేష్, బాలాజీ, రాంబాబు, విజయ్, వినోద్, భద్రియా తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.